AP: పీఎం మోదీ మే 2న అమరావతికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూర్చునేలా సభా ప్రాంగణం కోసం 100 ఎకరాలు, పార్కింగ్ కోసం 250 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం మంత్రులతో కమిటీని నియమించింది. అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్య కుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. నోడల్ అధికారిగా IAS వీరపాండ్యన్ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

previous post