PM Modi: న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.పహల్గాం దాడి అనంతర పరిణామాలు, భద్రత, సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ఈ సమావేశం జరిగింది.భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, త్రివిధ దళాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి భారత్ కృతనిశ్చయంతో ఉందని మరోసారి స్పష్టం చేశారు. హహల్గాం ఉగ్రదాడికి దీటుగా జవాబిస్తామని అన్నారు.జాతీయ భద్రతాంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ బుధవారంనాడు కీలక సమావేశం జరుపనుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ కీలక సమావేశానికి ముందుగానే మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్ తదితురులు మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.*_ఎంహెచ్ఏ కార్యాలయంలో.._*కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, భద్రతపై సమీక్షించేందుకు హోం మంత్రిత్వ శాఖ (MHA) కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. దీనికి హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షత వహించారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), సహస్ర సీమ బల్ (ఎస్ఎస్‌బీ), ఇండో-టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

previous post
next post