ఆదివాసీ గ్రామాలకూ అభివృద్ధి ఫలాలుపదేండ్లు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రంకేసీఆర్ ప్రభుత్వ విధానాల నేపథ్యంలో వందలాది మంది నక్సలైట్ల లొంగుబాటురైతుబంధు, బీమాతో పెరిగిన ధీమాగిరిజన, ఆదివాసీల రిజర్వేషన్లు పెంపుఅటవీ, భూముల పరిరక్షణకు కంకణంఆపరేషన్ కగార్‌ను ఆపాలన్న కేసీఆర్ డిమాండ్‌కు అన్నివర్గాల నుంచి మద్దతుఅడవి గుండెల్లో అభివృద్ధి గానం వినిపించింది. అరణ్య గర్భాన ప్రగతి ఫలాలు పరిఢవిల్లాయి. కొండల్లో, కోనల్లో, గిరిజన తండాల్లో, అణగారినవాడల్లో అన్నల అభివృద్ధి ఎజెండా రెపరెపలాడింది. ఉమ్మడి పాలనలో అన్యాయాలు, అక్రమాలను చూసి వానవాసానికి పూనుకున్న అన్నలు సైతం.. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి పల్లెలో వికసించిన ప్రగతి ఫలాలు చూసి జన జీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. నాడు ఉమ్మడి పాలనలో అభివృద్ధికి నోచుకోని ఆదివాసీ గూడెలు, గిరిజన తండాలు, అటవీప్రాంత గ్రామాలు.. స్వరాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన అన్నల అజెండాకు సలామ్ కొట్టాయి. ఉమ్మడి పాలనలో అభివృద్ధి కోసం ఆయుధాలెత్తిన వారు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి అరణ్యవాసాన్ని వీడారు. నాడు జరిగిన అభవృద్ధిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.నిరుపేదలకు ఆహారం, ఇల్లు లేని వారికి ఇల్లు, బలహీనులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే న్యాయమైన డిమాండ్ల సాధనకు నక్సలైట్లు పోరాడుతున్నందున.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నక్సలైట్ల ఎజెండానే అమలు చేస్తాం.-తెలంగాణభవన్ వేదికగా మలిదశ ఉద్యమ సారథిగా 15 ఏండ్ల క్రితం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి
నేను మీకొక విషయం స్పష్టం చేయాలె.. తెలంగాణలో నక్సలిజం పెరిగింది. తెలంగాణ ప్రజలంటే తుపాకులు చేతిలో పట్టుకొనే పుడుతారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణలో నక్సలిజం పెరిగిపోతది. పరిశ్రమలు రావు, పెట్టుబడులు ఉండవు..
మళ్లీ తెలంగాణలో కరువు తాండవిస్తది అని వితండవాదం చేస్తున్నారు. మనం స్వరాష్ట్రం సాధించుకుంటే చిన్నరాష్ట్రం అయితది. మనమే నక్సలైట్ల ఎజెండాను అమలు చేస్తే.. ఇక నక్సలిజం ఎక్కడుంటది? తెలంగాణ సాధిస్తే నేను చేసే పని అదే.
దుబ్బాకలో ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ ప్రభాకర్‌రెడ్డి నాడు బీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 29 : ఎన్‌కౌంటర్లు, రక్తపాతాల ద్వారా నక్సల్ సమస్య పరిష్కారం కాదని, మారుమూల ఆదివాసీ గ్రామాలకు సైతం సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించడం ద్వారా, మానవీయ కోణంలో ప్రభుత్వ సేవలను అందించడం ద్వారానే మౌలిక మార్పు సాధ్యమని కేసీఆర్ తన పాలనాకాలంలో రుజువు చేశారు. మలి దశ ఉద్యమం సాగుతున్న రోజుల్లో స్వరాష్ట్రం సిద్ధిస్తే అన్నల అజెండాను అమలు చేస్తామని చెప్తూ వచ్చిన కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడి సాధించుకున్న స్వరాష్ట్రంలో బృహత్తరమైన అభివృద్ధి పనులు చేపడుతూ మాట నిలుపుకున్నారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న మారణకాండను ప్రతిపక్షనేతగా నిరసించారు. కేసీఆర్ చేసిన ప్రకటనకు సబ్బండ వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వ పాలన ఉండటంతో రాష్ట్రంలోని ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరిగాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలోని తెలంగాణలో అభివృద్ధికి నోచుకోని ఆదివాసీ గూడేలు, గిరిజన తండాలు, అటవీప్రాంత గ్రామాలు స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇతర గ్రామాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. నాడు కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణకు హరితహారం పేరుతో అటవీ, భూముల సంరక్షణకు పూనుకున్నది. వెరసి నక్సలిజం వైపు మొగ్గుచూపే వారి సంఖ్య తగ్గిపోయింది.
స్వరాష్ట్రంలో వీడిన వనవాసం
కోరి, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సబ్బండ వర్గాలకు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను చూసి, అనేక మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు. 2018 నుంచి 2022 వరకు దాదాపు 250 మంది లొంగిపోయారు. వీరిలో 65 మంది మెయిన్ క్యాడర్ నేతలు ఉన్నారు. ఒక్క 2022లోనే సుమారు 35 మంది లొంగిపోయారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో 550 మందికిపైగా అరణ్యవాసం వీడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అందించిన ప్రజారంజక పాలనను చూసి, మావోయిస్టు ముఖ్య నేతలంతా ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు మకాం మార్చారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్
తెలంగాణలో నక్సల్ ప్రభావిత జిల్లాలైన కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ‘కమ్యూనిటీ పోలీసింగ్’ను పక్కాగా అమలు చేశారు. ఆదివాసీ, గిరిజన గ్రామాల్లోని ప్రజల కోసం రోడ్లు, మంచినీరు, విద్యుత్తు, జలశుద్ధి యంత్రాలు, పిల్లలు చదువుకునేందుకు వసతులు, యువతకు ఉపాధి కల్పన, క్రీడా మైదానాల ఏర్పాటులో పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు కేసీఆర్ ఆదేశాల మేరకు పటిష్టంగా పని చేశాయి.*_లొంగిపోయిన వారికి పునరావాస పథకం_*జనజీవన స్రవంతిలో కలిసిన వారి కోసం కేసీఆర్ ప్రభుత్వం పునరావాస పథకాన్ని పక్కాగా అమలు చేసింది. ఇంటి పట్టా, వ్యవసాయ భూమి, వ్యాపారం చేసుకునేందుకు రుణాలు ఇవ్వడం, వసతులు కల్పించడం, వారిపై ఉన్న చిన్నచిన్న కేసులు కొట్టివేయడం వంటి కార్యక్రమాలు అమలయ్యాయి.
తగ్గిపోయిన కొత్త రిక్రూట్‌మెంట్లు
మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఆరు జిల్లాల్లో తాగునీరు, వైద్యం, విద్య, గురుకులాలు, వ్యవసాయ, రవాణా సౌకర్యాలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కల్పించింది. ఆదివాసీ, గిరిజనులు, గిరిజనేతరులు సైతం మార్పు దిశగా పయనించారు. పొరుగు రాష్ర్టాలతో పోల్చితే.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు సత్ఫలితాలను ఇవ్వడాన్ని అన్నలు సైతం స్వాగతించారు. యుక్త వయసులోనే ఉద్యమంలోకి అడుగుపెట్టేవారి సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తగ్గిపోయింది. అడవిలో క్షణక్షణం భయంతో చనిపోవడం కంటే.. ధైర్యంగా ఉద్యోగాలు చేస్తూ తమ వారికి సేవ చేయాలని ఆలోచనతో వాపస్ వచ్చినవారి సంఖ్యే అధికంగా ఉన్నదని నిఘా వర్గాలు తెలిపాయి.
ఆ ఆరు జిల్లాల రైతుల్లో ధీమా!
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతీ రైతుకు రూ.5 లక్షలు బీమా సదుపాయం అందించి, రైతుల కుటుంబాలకు దీమా ఇచ్చింది. రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించి, వ్యవసాయంలో నష్టాలుపాలు కాకుండా కాపాడింది. నక్సల్ ప్రభావిత ఆసిఫాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో సుమారుగా 4 లక్షల మంది రైతులున్నారు. వీరిలో ఎస్టీ రైతులు సుమారు 63 వేల మంది ఉన్నారు. 2018 నుంచి వీరికి రైతుబంధు అందించింది. విద్య, వైద్యంపై దృష్టి తెలంగాణ ట్రైబర్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా అద్భుతమైన హాస్టల్ వసతితో నాణ్యమైన విద్యను అందించింది. గురుకులాల్లోని ఒక్కో విద్యార్థి కోసం కేసీఆర్ సర్కారు ఏటాసుమారు రూ.1.2లక్షలు ఖర్చు చేసింది. వీటికి తోడు ఏజెన్సీలో వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. ప్రతీ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. బిడ్డలకు నాణ్యమైన పోషకారాన్ని అందించింది._ఉద్యోగాల కల్పనలోనూ ముందంజ_స్వరాష్ట్రం సాధించిన తర్వాత మన ఉద్యోగాలు మన ప్రాంత బిడ్డలకే చెందాలన్న సంకల్పంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలోనే సుమారు 22 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించింది. 2022 నాటికే వివిధ రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా సుమారు లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. ఆ తర్వాత పోలీసు కొలువులే 15వేల వరకు భర్తీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం గిరిజన (ఎస్టీ) రిజ్వరేషన్లను 6% నుంచి పది శాతానికి పెంచింది. దీంతో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి._మా లక్ష్యం నెరవేరుతున్నది_నాటి పరిస్థితులకు, నేటి పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. కండ్లమందే బోలెడు అవకాశాలున్నాయి. మా బిడ్డలు గురుకులాల్లో చదువుతున్నారు. ప్రభుత్వం కల్పించిన వ్యవసాయ భూమిలో ఏటా రెండు పంటలు సాగు చేసుకుంటున్నాం. రైతుబంధు ఏడాదికి రూ.పదివేలు అందాయి. రైతుబీమాకు కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే డబ్బులు కట్టింది. అడవులను వదిలిన మాలాంటి కొందరు అన్నలు వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు నలుగురిలో గౌరవంగా బతుకుతున్నాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో మా లక్ష్యం నెరవేరింది.
జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు దంపతులు11 నెలల్లో 14 మంది అన్నలు హతం_*ఏడాది ప్రజాపాలనతో మావోయిస్టులపై ఉక్కుపాదం16 మందిని చంపారంటున్న పౌరహక్కులు సంఘంప్రజాస్వామ్యం, ప్రజాహక్కుల పునరుద్ధరణే 7వ గ్యారెంటీగా ప్రచారం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన అంటూనే తొలి ఏడాదిలోనే 14 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసింది. ఈ విషయాన్ని పోలీసు క్రైమ్ వార్షిక నివేదికలోనే అధికారికంగా వెల్లడించింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే మొత్తం 16 మందిని బూటకపు ఎన్‌కౌంటర్ల ద్వారా చిత్రహింసలు పెట్టి హతమార్చినట్టు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఈ తరహాలో మోసం చేస్తుందని ఊహించలేకపోయామని ప్రజా సంఘాలు, పౌరహక్కుల నేతలు అంటున్నారు. కోవర్టుల ద్వారా మత్తు మందు పెట్టి మరీ మావోయిస్టులను హతమార్చుతున్నారని, వారిని అరెస్టు చేసి, కోర్టు ఎదుట హాజరుపర్చకుండా ఎన్‌కౌంటర్ల పేరుతో వారి జీవించే ప్రాథమిక హక్కును పోలీసులు ఎలా కాలరాస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా, బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో కేవలం ఇద్దరు మావోయిస్టులు మాత్రమే ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.