అమరావతి :ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. 16,347 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డీఎస్సీలో ప్రభుత్వం మార్పులు చేసింది. స్కూల్ అసిస్టెంట్ విభాగంలో లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో SC, ST, BC, దివ్యాంగులకు 45శాతం కనీస అర్హత మార్కులను 40శాతానికి తగ్గిస్తూ జీవో ఇచ్చింది. అలాగే అభ్యర్థులు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని చెప్పింది. అయితే, వెరిఫికేషన్ సమయంలో మాత్రం ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలని పేర్కొంది.

previous post