Tv424x7
Andhrapradesh

తీరు మార్చుకోని లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ స్వర్ణలత..

సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ కేసులో ఆసక్తికర మలుపు ప్రస్తుతం స్వర్ణలత బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

విశాఖపట్నం మధురవాడగతంలో నోట్ల మార్పిడి కేసులో అరెస్టై రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రిజర్వ్‌ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ స్వర్ణలత పేరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. విశాఖపట్నం మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణిని బెదిరించిన కేసులోనూ స్వర్ణలత పాత్ర ఉన్నట్లు తేల్చారు పోలీసులు. నకిలీ ఏసీబీ ఇన్స్‌పెక్టర్‌ సుధాకర్‌ను అడ్డుపెట్టుకుని డబ్బు కోసం సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించినట్లు తేల్చారు. సుధాకర్‌ కాల్‌ లిస్ట్‌ ద్వారా స్వర్ణలత బండారాన్ని బయటపెట్టారు. గతంలో 2000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్టయ్యారు స్వర్ణలత. సినిమాల్లో నటించాలన్న పిచ్చితో డబ్బులు కూడగట్టేందుకు దొంగ పోలీస్ అవతారమెత్తారు. నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు… డ్యాన్సులు నేర్చుకున్నారు. అంతేకాదు ఏపీ 31పేరుతో ఓ సినిమా పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ తర్వాత నకిలీ దందా వ్యవహారం బయటపడటం.. అరెస్టవ్వడంతో కొన్నాళ్లు సైలెంట్‌ ఉన్నా స్వర్ణలత.. మళ్లీ దందాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు పోలీసులు. ఆమెకి ఇంకా సినిమా పిచ్చి పోలేదని చెబుతున్నారు.ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఏఆర్‌ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాపట్ల సహా చుట్టు పక్క ప్రాంతాల్లో స్వర్ణలత కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Related posts

ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

TV4-24X7 News

పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు మరియు భారీ జెండా ర్యాలీని ఘనంగా నిర్వహించిన వివేకానంద సంస్థ

TV4-24X7 News

అమెరికాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

TV4-24X7 News

Leave a Comment