Tv424x7
National

అండమాన్ నికోబార్ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు..!!

దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్‌ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. కాగా, రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ చెప్పుకొచ్చింది. మే 27వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.కాగా, సాధారణంగా జూన్‌ 1వ తేదీ నాటికి రుతుపవనాలు అండమాన్ ను తాకుతాయి. కానీ, ఈ సారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అలా, జరిగితే 2009 తర్వాత అంచనాల కంటే ముందే రుతుపవనాలు రావడం మళ్లీ ఇప్పుడే. అప్పుడు, మే 23వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకగా.. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది. ఇక, జూన్ 12వ తేదీ వరకు తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. తెలంగాణలో ఈ సారి సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ముగియనుంది అని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Related posts

రేపటి నుంచి అమల్లోకి 3 కొత్త చట్టాలు

TV4-24X7 News

రైలులో చైన్ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లోలాగాలి?

TV4-24X7 News

ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం

TV4-24X7 News

Leave a Comment