Tv424x7
Andhrapradesh

చెరువుల్లో మట్టి పొలాలకు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

ఏపీ ప్రభుత్వం( AP government) మరో నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. చెరువులు, జలాశయాల నుంచి పూడిక మట్టిని తరలించుకునేందుకు అవకాశం ఇచ్చింది.

సొంత అవసరాలకు.. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరులు మరమ్మత్తులకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. చెరువులతో పాటు కాలువల్లో మట్టి, పూడిక తీయాలని నిర్ణయించింది. అయితే ఆ మట్టిని రైతులు తమ సొంత పొలాలకు తరలించేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రైతులు సొంత ఖర్చుతో కూడిక తీసుకుని ఆ మట్టిని వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( Executive Engineer) నుంచి అనుమతులు తీసుకోవాలి. చెరువులు, జల వనరుల గట్లపై ఈ పూడిక తీసిన మట్టిని నిల్వ చేయకూడదు. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మట్టి అవసరమైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts

శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ని దర్శించుకున్న విల్లూరి భాస్కర రావు

TV4-24X7 News

ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదల

TV4-24X7 News

35 వ వార్డ్ లో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

TV4-24X7 News

Leave a Comment