బద్వేల్, గోపవరం మండలాలలో గ్రామ పెద్దలతో గురువారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ నాగభూషణ్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ నాగభూషణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చే విధంగా గ్రామ పెద్దలు చొరవ తీసుకోవాలన్నారు గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాలు, మసీద్ చర్చీలు పబ్లిక్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు, ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామాలకు వచ్చినప్పుడు సీసీ కెమెరాలు రికార్డుల నమోదు అవుతాయని వాటి ద్వారా తెలుసుకోవచ్చన్నారు, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాలలో పర్యటించి రకరకాల చోరీలకు పాల్పడుతూ ఉన్న సంఘటనలు కూడా కొన్ని ప్రాంతాలలో సంభవించాయని గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి చోరీలు పాల్పడకుండా ఉండాలంటే గ్రామంలో కచ్చితంగా కొన్ని ఏరియాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
