కడప/ఎర్రగుంట్లలో ఓ టైర్ల కంపెనీ ద్వారా పలువురి వద్ద ఆర్డర్లు తీసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్ బాబు తెలిపారు.నిందితుడు భరత్ కుమార్ (29) ఓ ప్రైవేట్ టైర్ల కంపెనీలో పనిచేస్తూ అక్రమ మార్గంలో ఎటువంటి బిల్లులు లేకుండా తన స్వలాభం కోసం టైర్లను కనుగోలుదారులకు ఇవ్వకుండా బ్లాక్ లో అమ్ముకుంటూ వచ్చిన మొత్తాన్ని నిందితుడు జల్సాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిందని సీఐ వివరించారు.నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు.

previous post
next post