అమరావతి :ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 60 గజాలలోపు ఇళ్లు నిర్మించుకునే వారికి ఇకపై మున్సిపల్ అనుమతులు అవసరం లేకుండా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం, కేవలం ఒక రూపాయి ఫీజుతో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే స్వయంగా ధృవీకరణ చేసుకోవచ్చు. ఇందులో సర్టిఫికెట్లను స్వయంగా అప్లోడ్ చేసుకొని, స్వయంగా వాటిని ఆమోదించుకోవచ్చని తెలిపింది.
