Tv424x7
National

ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి,

ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏడు కేసులు..ఢిల్లీ:కరోనా మహమ్మారి నుంచి తేరుకునేలోగా మరోసారి చైనా నుంచి మరో అంతు చిక్కని వ్యాధి బయలుదేరిన విషయం తెలిసిందే. చిన్నారుల్ని టార్గెట్ చేస్తున్న ఈ వ్యాధి పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా ఊహించిందే జరిగింది..ఈ బ్యాక్టీరియా ఇండియాలో వచ్చేసింది. దేశ రాజధానిలో ఇప్పుడు ఏడు కేసులు గుర్తించడం కలకలం రేపుతోంది.చైనాలో కరోనా తరువాత మరో అంతు చిక్కని వ్యాధి ప్రారంభమైంది. ముఖ్యంగా చిన్నారుల్ని ఈ వ్యాధి టార్గెట్ చేస్తోంది. చైనా ఆసుపత్రుల్లో ఈ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల్లో న్యుమోనియో వంటి లక్షణాలు కన్పించసాగాయి. అధిక జ్వరం, ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్ అనేవి ప్రధాన లక్షణాలుగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. చైనాలో ఆసుపత్రులు ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులతో నిండిపోతున్నాయనే వార్తలు కలకలం రేపాయి. ఈ వ్యాధికి కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. మైకో ప్లాస్మా న్యుమోనియాగా గుర్తించారు. బ్యాక్టీరియా కారణంగా వస్తుందని తెలిసింది. ఇప్పుడీ వ్యాధి దేశ రాజధాని ఢిల్లీలో ప్రవేశించడం ఆందోళన కల్గిస్తోంది..

Related posts

రెబలోడి బాక్సాఫీసు ఊచకోత ప్రభాస్ కి ప్రభాసే పోటీ…*

TV4-24X7 News

ఉక్రెయిన్, రష్యా మధ్య 96 మంది ఖైదీల మార్పిడి

TV4-24X7 News

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడి

TV4-24X7 News

Leave a Comment