కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోశ్రీ హనుమత్ జయంతి సందర్భంగా మల్ల కత్తవ వద్ద వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో కాషాయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించబడింది. మహిళలు తలపాగాలు ధరించి, బైకులు నడపడం, శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ విరజానంద స్వాముల వారు స్వయంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీ అనంతరం దేవాలయంలో శ్రీ విరజానంద స్వామి ఆధ్యాత్మిక, సామాజిక విషయాలను భక్తులకు వివరించారు.. హిందుత్వ కార్యక్రమాలకు కేంద్రంగా నిలిచిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి పట్టణములోని అన్ని వీధులకు సంబంధించిన వ్యక్తులు సహాయ సహకారాలు అందించి ,ఈ దేవాలయాన్ని శక్తి కేంద్రంగా మార్చాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్, ఎస్ ఎస్ ఎఫ్, జనహిత, బిజెపి, జనసేన, టిడిపి, వైయస్సార్సీపి కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

previous post