Tv424x7
Andhrapradesh

చెక్క లక్క ఏటికొప్పాక బొమ్మల తయారీ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం మరియు ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవం

విశాఖపట్నం సెయింట్ పీటర్స్ హై స్కూల్ ప్రాంగణంలో, ఆరు నెలలపాటు చెక్క లక్క బొమ్మలు( ఏటికొప్పాక) తయారీపై శిక్షణ పొందిన 30 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. వేదాంత సంస్థ- వి.జి.సి.బి పోర్ట్ వారి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత, ప్రాజెక్ట్ అలంకృత లో భాగంగా నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా, సంప్రదాయ కళకు ప్రోత్సాహం కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.జి . గీతా శ్రీకాంత్, సామాజిక కార్యకర్త మరియు ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఫెడరేషన్ చైర్‌పర్సన్ హాజరై, ఉత్పత్తి యూనిట్ మరియు నూతన యంత్రాలను ప్రారంభించారు. ఆమె మహిళలకు మార్కెటింగ్ నైపుణ్యాలపై ప్రేరణ ఇచ్చి, స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతీ ఒక్క మహిళ వ్యాపారాలలో రాణించాలని ప్రభుత్వం అందించే పథకాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు తయారు చేసిన కొన్ని బొమ్మలు కొనుగోలు చేయడం జరిగింది. శ్రీలక్ష్మి, వేదాంత సంస్థ, వి.జి. సి. బి పోర్ట్, సి.ఏస్.ఆర్ హెడ్, మాట్లాడుతూ శిక్షణ పూర్తిచేసిన మహిళలు ఈ అవకాశాన్ని వాడుకుని మంచి ప్రొడక్షన్ చేయాలని కోరారు. సంస్థ తరఫున మరిన్ని అవకాశాలను కల్పించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన చెక్క బొమ్మల వివరాలు, ధరలు, నమూనాలతో కూడిన ఉత్పత్తి కేటలాగ్ బుక్స్ ను ఆమె ఆవిష్కరించడం జరిగింది. అఫ్రో ప్రాజెక్టు మేనేజర్ కే. విజయ భాస్కర్, మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు వచ్చిన అతిధుల ద్వారా అందించడం జరిగింది అని శిక్షణ పొందిన వారు మంచి ఉత్పత్తులు తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేసి ప్రతిఒక్కరు ఉపాధి పొందాలని కోరారు.ఈ కార్యక్రమానికి సీనియర్ ఆర్టిసన్, ఏటికొప్పాక ట్రైనర్ ముప్పన శ్రీనివాసు, కోవె సంస్థ ఏ.పీ జాయింట్ సెక్రటరీ జయలక్ష్మి, ఆప్రో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వై. అశోక్ కుమార్, మొబిలైజర్లు ఆశా, అనిల్ లు పాల్గొన్నారు.

Related posts

10 నెలల్లో రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి లోకేష్

TV4-24X7 News

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకె కంచరపాలెం ట్రాఫిక్ సీఐ దశరధి

TV4-24X7 News

నాగబాబుకు మంత్రి పదవి లేనట్టేనా?

TV4-24X7 News

Leave a Comment