Tv424x7
Telangana

కొత్తగూడెం జిల్లాలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

కొత్తగూడెం జిల్లా: మావోయిస్టుల కోసం తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అడవుల్లో భద్రతా దళాలు మావోయి స్టులు సంచరించిన స్థావరా లను అణువు అణువు జల్లెడ పడుతున్నాయి. ఇటీవల కర్రే గుట్టలు, నారాయణపూర్, మాడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌం టర్‌లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావుతో సహా పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం చేస్తామని, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచే సుకుంది. ఈరోజు కొత్తగూడెంలో మొత్తం 17 మంది మావో యిస్టులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయా రు. అందులో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే, లొంగిపోయిన వారంతా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మావోయి స్టులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు వసతులు కల్పిస్తామని, వారి భవిష్యత్తుకు పూర్తి హామీ ఇస్తున్నామని ప్రకటించారు.

Related posts

కొత్త ఎమ్మెల్సీల నియామ‌కం… తెలంగాణ స‌ర్కార్ కు రిలీఫ్?

TV4-24X7 News

కేటీఆర్, కవిత, హరీశ్ మధ్య ఆస్తి గొడవలు: కోమటిరెడ్డి

TV4-24X7 News

పేకాట ఆడుతున్న తెలంగాణ మహాలక్ష్మిలు అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment