దేవుడు వరమిచ్చినా..,పూజారి వరమివ్వలేదు??? అంటే ఇక్కడ పూజారి భగవంతుకంటే గొప్పవాడని,అర్ధమా???.., అన్నట్టు వ్యవహరిస్తున్న కంచికచర్ల సబ్ స్టేషన్ విద్యుత్ శాఖ అధికారి(కంచికచర్ల విద్యుత్ శాఖ ఏఈ)కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సౌర విద్యుత్ రంగం దేశమంతటా అభివృద్ధికి నాందిగా నడుస్తుంది.అలాంటి ఈ పథకానికి ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించి 2029 కల్లా కోటి ఇళ్ళకి సౌర విద్యుత్ ఉండేవిధంగా కార్యాచరణ చేయడం జరిగింది.అలాంటి ఈ పథకాన్ని బ్రష్టు పట్టిస్తున్న కంచికచర్ల సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్.సోలార్ అప్లికేషన్ పూర్తిచేసుకుని బ్యాంకు లోను కూడా వెండర్ ఖాతాలో జమపడి సోలార్ వెండర్ సోలార్ ప్యానల్ను ఇన్స్టాలేషన్ చేయడం కూడా అయిపోయింది.ఇదింతా ఒక ఎత్తైతే తర్వాత సోలార్ మీటర్ బిగించకుండా ఇంత చేసినా ఉపయోగం ఉండదు అలాంటి దానికి మీటర్ జారీ చేయకుండా జాప్యం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారి(కంచికచర్ల విద్యుత్ శాఖ ఏఈ).అదేమని వినియోగదారుడు అధికారిని అడిగితే మాదేమి లేదు వెండర్ యొక్క తప్పు ఇది నాకు ఇంకా వెండర్ తరపు నుంచి అప్లికేషన్ రాలేదని సాకులు చెబుతున్న వైనం.ఈ విషయంపై సదరు వెండర్ మీద వినియోగదారుల ఫారంకి కంప్లైంట్ చేయమని స్వయంగా చెప్తున్న అధికారి(కంచికచర్ల విద్యుత్ శాఖ ఏఈ)ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని ఒక్కొక్క డిస్కామ్ తరఫున ఒక నోడల్ ఆఫీసర్ ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది.అలాంటి అధికారికి ఈ సమస్యను తీసుకెళ్లడం మానేసి ఉచిత సలహలిస్తున్న విద్యుత్ శాఖ అధికారి(కంచికచర్ల విద్యుత్ శాఖ ఏఈ).ఈ సమస్యను గాలికి వదిలేసి సమస్య పరిష్కరించకుండా…!సదరు వెండర్ మీద చర్యలేమి తీసుకోకుండా జాప్యం చేస్తున్న అధికారి(కంచికచర్ల విద్యుత్ శాఖ ఏఈ).ఆ వెండర్ కి సదరు విద్యుత్ అధికారికి లావాదేవీలు ఉండటంవల్ల తనపై చర్యలేమి తీసుకోకపోవడం వల్ల వినియోదారుడికి న్యాయం జరగట్లేదని వాపోతున్న సోలార్ విద్యుత్ వినియోగదారుడు…సదరు వెండర్ పై ప్రేమ ఎందుకని నివ్వెర పోతున్న సోలార్ విద్యుత్ వినియోగదారుడు.ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయవలసిందిగా వాపోతున్న సోలార్ విద్యుత్ వినియోగదారుడు…!
