కడప/పులివెందులలోని డాక్టర్ఆ వైస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్చార్జ్ గా సూపరింటెండెంట్ కె.వి విఘ్నేశ్వర్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈయన గతంలో కడప రిమ్స్ నందు అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. పదోన్నతి కింద ఆయన పులివెందుల ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందరి సహకారంతో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. కాగా ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్ డేవిడ్ సెల్వన్ రాజ్ బదిలీ అవుతారని సమాచారం అందినప్పటికీ అధికారికంగా ఉత్తర్వులు వెలువడకపోవడంతో ప్రస్తుతం ఆయన పులివెందుల ఆసుపత్రిలోనే ఉన్నారు.

previous post
next post