Tv424x7
National

జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపు…!

ఆపరేషన్ కగార్ లో భాగంగా చేస్తున్న ఎన్ కౌంటర్లు ను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు నిచ్చింది..ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల అయింది, జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలని ఆ ప్రకటనలో కోరారు. 2026 ఏడాది మార్చి నాటి కి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్య మని కేంద్రం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆపరేషన్‌ కగార్‌‌ను ప్రారంభించింది. ఇది గతేడాది నుంచి ఆపరేషన్ ఊపందుకుంది. మావోయిస్టు కీలక నేతలను భద్రతా దళాలు మట్టబెడు తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల నుంచి ఓ లేఖ బయ టకు వచ్చింది. ఆ లేఖలో మావోయిస్టు కేంద్ర కమిటీ జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొ న్నారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా భారత్‌ బంద్‌కు పిలుపుని చ్చినట్లు రాసుకొచ్చారు.. మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ పేరుతో లేఖ విడుదల చేశారు.ఛత్తీస్‌ఘడ్‌లోని అబూజ్‌ మడ్‌ అడవులు ఇన్నాళ్లు మావోయిస్టులకు కీలక స్థావరాలుగా ఉన్నాయి. కానీ అక్కడికి కూడా భద్రతా బలగాలు చొచ్చుకె ళ్తున్నాయి. దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగి స్తూ.. భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. కాగా.. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ పూర్‌ జిల్లాలో జరిగిన ఎదు రుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్‌ బసవరాజు మే 21న మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎక్స్‌లో వెల్లడించారు.

Related posts

వాట్సాప్ స్టేటస్​​లో 1 మినిట్​ వీడియో!

TV4-24X7 News

స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్‌, మస్క్‌.. కానీ!

TV4-24X7 News

కీలక విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: ట్రూడో

TV4-24X7 News

Leave a Comment