ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. గత 3 రోజులుగా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా ఇదే ఏరియాలో గురువారం మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత తెంటు లక్ష్మీనరసింహ అలియాస్ గౌతమ్, నిన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ హతమయ్యా రు.
