Tv424x7
Andhrapradesh

కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటన….పిల్లల చదువుకు హామీ

అన్ని విధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సిఎం భరోసా

అమరావతి, జూన్ 17 :- చిత్తూరు జిల్లా ,కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. ఇటువంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని సిఎం అన్నారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. వారిని బాగా చదివించాని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని….ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి…అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సిఎం హామీ ఇచ్చారు. ఘటన, తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని సియం అధికారులను ఆదేశించారు.

Related posts

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌

TV4-24X7 News

దంగేటి చంద్రశేఖర్ జ్ఞాపకార్దం వృద్దులకు నిరుపేదలకు అన్నసమర్పణ

TV4-24X7 News

కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా సెలవులు అడగొద్దు

TV4-24X7 News

Leave a Comment