Tv424x7
Andhrapradesh

జగన్ టార్గెట్ అదే – అందుకే సత్తెనపల్లి టూర్ !

జగన్ రెడ్డి బుధవారం సత్తెనపల్లి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. వైసీపీ తీరుతో మొదట పోలీసులు అనుమతి లేదని చెప్పేశారు. అయినా, తాను వెళ్తా అంటూ జగన్ మొండికేస్తున్నారు. రెంటపాళ్లలోని నాగమలేశ్వర్ రావు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తే తప్పేంటి అని వైసీపీ నేతలూ ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పేమి కాదు..పర్యటన పేరిట వైసీపీ ఏం చేస్తుందో ఇటీవలి జగన్ పొదిలి పర్యటనతో ఓ క్లారిటీ రావడంతో మొదట పోలీసులు అనుమతివ్వలేదు.పొదిలి పర్యటనలో పొగాకు రైతులతో ముఖాముఖి అంటూ శాంతి భద్రతల సమస్యను సృష్టించారు జగన్. బయట వాళ్లను పొదిలిలో జమ చేసి లా అండ్ ఆర్డర్ కు విఘాతం కల్గించారు. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారో లేదో, జగన్ పర్యటనల అనుభవాలతో ఆయన సత్తెనపల్లి టూర్ కు వెళ్తానంటే పోలీసులు అభ్యంతరం చెప్పారు.కానీ, జగన్ మాత్రం కుదరదు అంటున్నారు. నాగమలేశ్వర్ రావు కుటుంబాన్ని జగన్ రెడ్డి పరామర్శించాలనుకుంటే, పోలీసుల అనుమతి ఇవ్వలేదని చెప్పి వారిని తాడేపల్లికి పిలిపించుకునే అవకాశం ఉంది. కానీ, అదేపనిగా మేము వెళ్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వైసీపీ క్యాడర్ ను రెచ్చగొడుతుండటంతో ఎక్కడో తేడా కొడుతోంది. అతికొద్ది మందితో రెంటపాళ్ల వెళ్లాలని పోలీసులు చెప్పారు.. కానీ వైసీపీ ప్లాన్ వైసీపీకి ఉండటంతో ఏం చేస్తుందోననేది సత్తెనపల్లిలో టెన్షన్ కనిపిస్తోంది.జగన్ సత్తెనపల్లి టూర్ ఉద్రిక్తతను పెంచేసేలా ఉంది. అసలు ఈ పర్యటన లక్ష్యం నాగమలేశ్వర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు కాదు..ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యను సృష్టించడమేనని చెప్పుకొస్తున్నారు.

Related posts

దంగేటి చంద్రశేఖర్ జ్ఞాపకార్దం వృద్దులకు నిరుపేదలకు అన్నసమర్పణ

TV4-24X7 News

కుప్పలు తెప్పలుగా వయాగ్రాలు, అబార్షన్ కిట్స్.. ..డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ లలో బయట బడిన వైనం

TV4-24X7 News

వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగ్ తయారీ ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment