Tv424x7
Andhrapradesh

తల్లికి వందనం డబ్బు అడగడానికి వెళ్లిన వారిపై వెల్ఫేర్ అసిస్టెంట్ దాడి*

గాయపడ్డ బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించిన 108 సిబ్బంది

అన్నమయ్య :తల్లికి వందనం అడిగిన వారిపై వెల్ఫేర్ అసిస్టెంట్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బుధవారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం లోని, బి.కొత్తకోట మండలం, గుమ్మసముద్రం గ్రామంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. ఒడిగిలవారిపల్లికి చెందిన నాగభూషణం, అనురాధ, శంకరప్ప తదితరులు గుమ్మసముద్రం లోని సచివాలయానికి తల్లికి వందనం డబ్బు పడిందా.. లేదా..? అని అడగడానికి వెళ్లారు. డబ్బు పడిందా లేదా అని మాట్లాడడంతో ఆగ్రహించిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ దాడి చేసి ముగ్గురిని గాయపరిచాడు. గాయపడ్డ వారిలో ఒడిగిలవారి పల్లెకు చెందిన నాగభూషణం, అనురాధ, శంకరప్ప ఉన్నారు. బాధితులను బి కొత్తకోట 108 సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

రేపు తెలంగాణ లో మద్యం దుకాణాలు బంద్ తో పాటు 144 సెక్షన్

TV4-24X7 News

గండి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం చేసిన దాత

TV4-24X7 News

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోబంద్ జయప్రదం:-బ్రహ్మంగారిమఠం

TV4-24X7 News

Leave a Comment