పుల్లారెడ్డిపేట గ్రామం, దువ్వూరు మండలం కడప జిల్లా లో నివాసం వుండే ఇరగంరెడ్డి వీరమ్మ వీరి భర్త అయిన రాష్ట్ర వైసీపీ నేత ఇరుగంరెడ్డి తిరుపాల్ రెడ్డి దంపతుల 61 వ వివాహ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపాల్ రెడ్డి దంపతులకు వీరి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లో పాల్గొని పుణ్యదంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఎంతో సంబరంగా, సంతోషం గా ఈ వేడుకలు ఇరగం రెడ్డి వారి స్వగృహం లో జరిగాయి. తిరుపాల రెడ్డి తన జీవితంలో మధురమైన సుదినం గా భావిస్తూ, తన కుటుంబ సభ్యులు, బంధువులు, iశ్రేయోభిలాషులు, అభిమానుల మధ్యలో ఈ రోజు తన 61 సంవత్సరాలు పెళ్లి రోజు పూర్తి చేసుకున్న సందర్భముగా… పుల్లారెడ్డి పేటలోని తన స్వగృహం లో ఘనంగా వేడుకలు, సంబరాలు జరుపుకున్నారు. వీరికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపెందుకు పెద్దఎత్తున కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు తరలి వచ్చారు. ఈ శుభ సందర్బంగా ఈ ఆదర్శ దంపతులకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లు, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, సర్పంచ్ లు ఇలా పలువురు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్సాహం చూపారు. ఈ సందర్బంగా వచ్చిన అతిధులకు పెద్ద కేక్ కట్ చేసి, భోజనాలు ఏర్పాట్లు చేశారు.
