అంధ్రప్రదేశ్ : మాజీ సీఎం జగన్ సహా పలువురు వైస్సార్సీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వారంతా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరగనుంది.
