Tv424x7
AndhrapradeshCinima News

కన్న కూతురు బిడ్డనే ఎత్తుకెళ్లిన తాత – తాగుడుకు బానిసై దిగజారిన పెద్దరికం

తల్లి చెంతకు పసిపాప – కన్న కూతురు బిడ్డనే ఎత్తుకెళ్లిన తాత – తాగుడుకు బానిసై దిగజారిన పెద్దరికం- పిర్యాదు చేసిన 36 గంటల్లో తల్లి చెంతకు చిన్నారి.-ప్రొద్దుటూరు 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపిన తల్లి.వ్యసనం వ్యక్తిత్వాన్ని దిగజార్చింది. తాగుడు కోసం కడుపున పుట్టిన బిడ్డ ఇంటిలో తండ్రి దొంగతనం చేశాడు. డబ్బు సెల్ ఫోన్ తో పాటు మూడు నెలల పసిపాపను స్వయానా ( మనవరాలిని) ఎత్తుకెళ్లాడు. ప్రొద్దుటూరు నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన మనిషి వ్యసనానికి బానిసైతే ఏ స్థాయికి దిగజారుతాడున్న దానికి అద్దం పడుతోంది. 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూపర్ బజార్ రోడ్డు లో నాగల కట్ట దగ్గర గురుప్రియ, నాగు నాయక్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడు నెలల పాప ఉంది. గురుప్రియ తండ్రి గురు శేఖర్ అప్పులు చేసి సొంత ఊరు లో వుండలేక కూతురు ఇంటికి వచ్చాడు. డిసెంబర్ 8 వ తేదీన కూతురు ఇంటి వద్ద పసికందుని నాన్న చేతిలో పెట్టి పని కోసం బయటికి వెల్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూస్తే పాపతోపాటు నాన్న కనిపించలేదు. ఇంట్లో డబ్బు సెల్ ఫోను కనిపించకపోవడంతో అనుమానం వచ్చి తెలిసినవారు ఇళ్ళన్ని తిరిగారు. ఎక్కడ వారి జాడ కనిపించలేదు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాప ఇప్పుడెక్కడుందో..ఎలా ఉందొ అని తల్లడిల్లిన తల్లీ, ఎట్టకేలకు ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. నిన్నటి దినం తొమ్మిదవ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాలు తాగే మూడు నెలల పసికందును తల్లి ఒడికి చేర్చాలనే ఉద్దేశ్యం తోటి రెండు స్పెషల్ టీం లను ఏర్పాటు చేసి కేవలం 36 గంటల కాల వ్యవధిలోనే కేసును చేధించినారు. రాజంపేట లో తాత ను అదుపులోకి తీసుకొని పసిబిడ్డను సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. దూరమైన పసిపాపను సురక్షితంగా తిరిగి తల్లి చెంతకు చేర్చడంతో ఆమె పోలీసులను రెండు చేతులు జోడించి మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ఆనంద భాష్పాలతో మోకరిల్లి కృతజ్ఞతలు తెలిపినది.సదరు కేసు చేధనకు కృషి చేసిన ప్రొద్దుటూరు 3 వ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకట రమణను మరియు వారి సిబ్బంది HC శ్రీనివాసులు,కానిస్టేబుల్ తిరుమల, దస్తగిరి,పక్కిరప్ప శివానంద, హోమ్ గార్డ్ సురేంద్ర యాదవ్ గారిని రాజశ్రీ కడప జిల్లా SP శ్రీ సిద్దార్థ్ కౌశల్ IPS గారు మరియు అడిషనల్ ఎస్పీ శ్రీ తుషార్ DD IPS అభినందించారు.

Related posts

రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ

TV4-24X7 News

టీటీడీ అధికారుల నిర్ణయానికి నో చెప్పిన ఛైర్మన్ బీఆర్ నాయుడు…

TV4-24X7 News

దైవ ప్రచారం ముసుగులో రూ.1.21 కోట్ల విలువైన గంజాయి సరఫరా

TV4-24X7 News

Leave a Comment