జగన్ కేసు.. తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టుAP: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను జులై 1న(మంగళవారం) చేపడతామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి చనిపోయినట్లు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

previous post