ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి పూర్ణచందర్ అనే వ్యక్తి ప్రధాన కారణం అని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిస్పందనగా ఓ ఐదు పేజీల లేఖను విడుదల చేశారు.అందులో స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది .తమ మధ్య జరిగింది ఇదే అంటూ పూర్తి వివరాలు పొందుపరిచారు. అంతేకానీ తాను ఆత్మహత్యకు ఎలా కారణం అవుతానని ఆ రాసుకు వచ్చారులేఖలో ఏముంది?పూర్ణచందర్ విడుదల చేసిన ఆ లేఖలో 2009 నుంచి తనకు స్వేచ్ఛతో స్నేహం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో స్నేహం కారణంగా ఆమె కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా తనతో పంచుకునేదన్నారు. అయితే స్వేచ్ఛకు మొదటి వివాహం అప్పటికే అయ్యిందని ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలవల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, 2017లో రెండో వివాహం కూడా చేసుకుందని దురదృష్టవశాత్తు అతని నుంచి కూడా ఆమె విడాకులు తీసుకున్నారన్నారు. ఈ రెండు పెళ్లిళ్లతో తను ఎలాంటి సంతోషం పొందలేదని పూర్ణచందర్ రాసుకొచ్చారు.స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి కార్యకర్తలుగా పని చేస్తూ ఉండేవారు. అన్నా వదినల సంరక్షణలోనే వాళ్ళు వదిలేసారని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తనని చూడడానికి వచ్చేవారని స్వేచ్ఛ చెప్పినట్లుగా పూర్ణచందర్ అన్నారు. ఈ నేపథ్యంలో 2020 నుంచి స్వేచ్ఛ పూర్ణచందర్ కు మరింత దగ్గరైనట్లు కూడా ఆయన ఈ లేఖలో రాసుకొచ్చారు. ప్రధానంగా స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్ అని స్వేచ్ఛ తండ్రి ఆరోపణలను ప్రతిస్పందనగా ఈ సుదీర్ఘ లేక పూర్ణచందర్ విడుదల చేశారు .అయితే తరచుగా స్వేచ్ఛ తల్లిదండ్రుల మధ్య గొడవలు తట్టుకోలేక రాంనగర్ వద్ద ఇల్లు తీసుకుందని చెప్పారు. ఆ తర్వాత తన కుమార్తెను కూడా తన వద్దకు తీసుకువచ్చింది. అయితే తండ్రి స్థానంలో ఆమె కూతురు బాధ్యతలు కూడా తనే తీసుకున్నట్లు పూర్ణచందర్ తెలిపారు. ఇక స్వేచ్ఛ డిప్రెషన్ కి గురై మానసిక ఆవేదన నుంచి బయటపడటానికి కూడా అనేకసార్లు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు. స్వేచ్ఛ పాప ఇద్దరు కష్టపడకూడదు అని దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు చేసి పాప మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా ఆయన నిర్వహించినట్లు తెలిపారు.అంతేకానీ, స్వేచ్ఛ తో గాని ఆమె కూతురుతో గాని తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఆత్మహత్యకు స్వేచ్ఛ సూసైడ్ కి ముందు రోజు స్వేచ్ఛ తండ్రి ఇంటికి వచ్చి ఆమెను చాలా అవమానకరంగా మాట్లాడారు. ‘రెండేళ్లకోసారి ఇతను మీ అల్లుడు అని చెబితే నాకు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. డబ్బు లేకపోయినా గౌరవం కోల్పోలేనని’ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె తనతో చెప్పుకొని ఏడ్చిందని అన్నారు పూర్ణచందర్. ఆయన పేరుపై విడుదల లేక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
