లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారంపెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతోనే దారుణం!బాధితురాలిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన రెండో నిందితుడుదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దక్షిణ కలకత్తా లా కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ కేసులో కీలక ఆధారం లభించింది. 24 ఏళ్ల బాధితురాలిపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, ఆమె ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నిందితులు బాధితురాలిని కాలేజీ గేటు నుంచి క్యాంపస్‌లోని గార్డు రూమ్‌లోకి బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు ఇందులో స్పష్టంగా రికార్డయ్యాయని కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్లడించాయి. అసలేం జరిగింది?కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఉన్న సౌత్ కలకత్తా లా కాలేజీలో ఈ నెల 25న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే కాలేజీలో చదువుతున్న ఇద్దరు సీనియర్ విద్యార్థులు, ఒక మాజీ విద్యార్థి క్యాంపస్‌లోని గార్డు గదిలో బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాతి రోజున బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడైన మనోజిత
