అమెరికాలో భారత రాయబారిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా నియమితులయ్యారు. ఇదివరకు పనిచేసిన తరణ్‌జిత్ సంధు జనవరిలో పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో వినయ్ క్వాత్రాను విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) శుక్రవారం నియమించింది. త్వరలోనే వినయ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎంఈఏ తెలిపింది. 1988లో ఐఎఫ్‌ఎస్ అధికారిగా విధుల్లో చేరిన వినయ్ క్వాత్రా వివిధ హోదాల్లో పనిచేశారు.
previous post

