టీజీ: పాశమైలారం పరిశ్రమలో పేలుడు ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు సిగాచీ పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

previous post