కడప /మైదుకూరు :దువ్వూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన పెళ్లి కానీ మహిళను ( వయస్సు 22 సంవత్సరాలు) మాయమాటలతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాజీపేట సీఐ మోహన్ దువ్వూరు ఎస్సై వినోద్ కుమార్ లు బుధవారం దువ్వూరు పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు వారు తెలిపిన వివరాల మేరకు 8 నెలల కిందటనిందితుల ఒకరైన మైనర్ ఆమెను మాయమాటలతో నమ్మించి బలవంతంగా ఆమె ఆత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫోటోలను వీడియోలను మైనార్టీ నిందితుడు అతని మొబైల్లో పెట్టుకొని, ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఇంకోసారి అత్యాచారం చేశాడు. మహిళ ఫోటోలను వీడియోలను నిందితుడు అతని స్నేహితుడైన ఈ కేసులో మరొక ముద్దాయి అయినటువంటి ఎర్రగుంట్ల కార్తీక్ రెడ్డి (వయస్సు 22 ) రెండు నెలల కిందట అను అతనికి వాట్స్అప్ ద్వారా మహిళ ఫోటోలో వీడియోలను అతనికి పంపించాడు. కార్తీక్ రెడ్డి ఆ ఫోటోలను వీడియోలను అడ్డం పెట్టుకొని ఆ మహిళను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ తల్లిదండ్రులు ఏమంటారో అని భయపడి..కుటుంబ పరువు పోతుందని..నిందితుల నుండి ఒత్తిడి బ్లాక్ మెయిల్ కు భయపడి ఇన్నాళ్లు ఆ మహిళ ఎవరికీ చెప్పలేదు…చివరకు కుటుంబ సభ్యులకు తెలియపరచగా దువ్వూరు పోలీసులకు జూన్ నెల 28వ తేదీన మహిళ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు…మహిళ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాజీపేట సీఐ మోహన్ , దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ మీడియాకు తెలియజేశారు.

previous post