ఏపీ: మాజీ సీఎం జగన్ను చూస్తే కూటమి నేతలకు భయమని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అందుకే రైతుల వద్దకు జగన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించాలని కూటమి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అంతేకాదు, జనసేన, టీడీపీ నేతలు జగన్ పర్యటన రద్దు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ చిత్తూరు జిల్లాకు జగన్ రావడం ఖాయమని, మామిడి రైతులను కలవడం పక్కా అని అన్నారు.

previous post
next post