Tv424x7
Telangana

చేపపిల్లల పంపిణీ ఉందా.. లేదా..?సీజన్‌ మొదలైనా నిర్ణయం తీసుకోని సర్కారు

హైదరాబాద్‌, వానకాలం సీజన్‌ మొదలైనా రాష్ట్రంలో చేపల పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పంపిణీ ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వానాకాలం ప్రారంభం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా 22 కేంద్రాల్లో చేప విత్తనాల పెంపకానికి చర్యలు చేపట్టేవారని, ఆగస్టులో చెరువులు నిండగానే సహకార సంఘాలకు సరఫరా చేసేవారని గుర్తుచేస్తున్నారు.వీటిని రాష్ట్రంలోని 26,357 చెరువుల్లో చేప పిల్లల విడుదల చేసేవాళ్లమని చెప్తున్నారు. కానీ ఈ ఏడాది చేపల పెంపకంపై ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు. చేప పిల్లలను సరఫరా చేసే ఏజెన్సీలకు ప్రభుత్వం రూ.114 కోట్ల బకాయిలు ఉన్నట్టు మత్స్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. 2025-26 సంవత్సరానికిగాను 81 కోట్ల చేపపిల్లల పంపిణీకి ప్రణాళికలు రూపొందించి, ప్రభుత్వానికి పంపించామని, ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆమోదంలో జాప్యం చేస్తున్నదని వాపోయారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక స్వావలంబన లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకాన్ని నీరుగార్చొద్దని సహకార సంఘాలు కోరుతున్నాయి..!!

Related posts

అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు…! పలుచోట్ల వరదకు కొట్టుకుపోయిన రోడ్లు

TV4-24X7 News

Rice Price: పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!..

TV4-24X7 News

నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ

TV4-24X7 News

Leave a Comment