Tv424x7
AndhrapradeshPolitical

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. హాజరైన బ్రాహ్మణి, మోక్షజ్ఞ

Yuvagalam: లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. హాజరైన బ్రాహ్మణి, మోక్షజ్ఞ

తుని: ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) పైలాన్‌ను ఆవిష్కరించారు..కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లోకేశ్‌తో పాటు బ్రాహ్మణి, దేవాన్ష్‌, మోక్షజ్ఞ పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది..పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలం దిండి వద్ద సెప్టెంబరు 8న యాత్ర ప్రవేశించింది. మర్నాడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్ర 79 రోజులపాటు ఆగింది. గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు. అన్నివర్గాలూ పాదయాత్రకు నీరాజనం పలికాయి..

Related posts

హెూంమంత్రి ఆదేశాలతో రంగంలోకి విశాఖ పోలీసులు

TV4-24X7 News

పగటిపూట రాత్రిపూట ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి గోపాలపట్నం పోలీస్ సిబ్బంది

TV4-24X7 News

శ్రీవారి భక్తులకు తీపి కబురు.. ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు..!

TV4-24X7 News

Leave a Comment