Tv424x7
Andhrapradesh

మృత శిశువుకు రెడ్ క్రాస్ అంత్యక్రియలు

విశాఖపట్నం ఒక మృత శిశువుకు రెడ్ క్రాస్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 10న మద్దిలపాలెం బస్ డిపో వెనుక చెట్ల మధ్య ఓ నవ జాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన విషయం తెల్సిందే. సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు దొండపర్తి-1 సచివాలయ వీఆర్వో కృష్ణ చైతన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. నవజాత శిశువును కేజీహెచ్ కు తరలించి చికిత్స అందజేశారు. అయితే అదే తేదీన మధ్యాహ్నం 3గంటలకు వీఆర్వో ఇచ్చిన మరో నివేదిక ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బిడ్డను 6అడుగుల ఎత్తున్న గోడపై నుంచి పడేశారని ప్రాథమికoగా తేల్చినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే కేజీహెచ్ లో చికిత్స పొందుతూ సదరు శిశువు మృతి చెందింది. ఆ అనుబంధ నివేదిక ఆధారంగా కేసును ఆల్టర్ చేసిన పోలీసులు ఈ సమాచారాన్ని పెదవాల్తేరులోని జీవీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెడ్ క్రాస్ హోంలెస్ షెల్టర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఎంవీపీ సీఐ మురళీ ఆదేశాల మేరకు ఆదివారం ఆ మృత శిశువుకు ఎస్ఐ ధనుంజయ నాయుడు, కానిస్టేబుల్ రాజు సమక్షంలో రెడ్ క్రాస్ తరపున జ్ఞానాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించామని షెల్టర్ మేనేజర్ మురళీ తెలిపారు.

Related posts

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ..

TV4-24X7 News

టీడీపీ లో 60మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా

TV4-24X7 News

జూన్ నెలలో కూడా బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్ డబ్బులు

TV4-24X7 News

Leave a Comment