Tv424x7
Telangana

రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ దాకా వెళ్లింది. సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడని ముఖ్యమంత్రి ప్రశంసించారు.గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ మేరకు ఇవాళ(ఆదివారం, జులై20) పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్‌కు భారీ నజరానాను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వానికి రాహుల్ సిప్లిగంజ్‌ ధన్యవాదాలు తెలిపారు..

Related posts

బిగ్​బాస్​ గంగవ్వపై కేసు నమోదు

TV4-24X7 News

బెట్టింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు 28వరకు కస్టడీ

TV4-24X7 News

త్వరలోనే మహిళలకు ఎలక్ట్రానిక్ ఆటోలు?*

TV4-24X7 News

Leave a Comment