Tv424x7
National

గూగుల్ మ్యాప్స్ చెప్పినట్టే వెళితే… వరద నీటిలో మునిగిన కారు!

కేరళలో ఘటనజలమయం అయిన రోడ్లు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయ్యి ఇబ్బందుల్లో పడిన దంపతులుకాపాడిన స్థానికులుఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ ను నమ్మి దారితప్పిన ఘటనలు చాలా జరుగుతున్నాయి. సగం నిర్మించిన బ్రిడ్జిలపైకి వెళ్లి ప్రమాదాలకు గురికావడం, అడవుల్లోకి వెళ్లడం వంటి వార్తలు వచ్చాయి. తాజాగా, ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. కేరళకు చెందిన జోసెఫ్ అనే వ్యక్తి భార్యతో కలిసి కారులో వెళుతూ గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయ్యి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కేరళలో ప్రస్తుతం రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం ప్రాంతంలోని కడుతురుత్తి రోడ్లు జలమయం అయ్యాయి. కాగా, జోసెఫ్, ఆయన భార్య అదే సమయంలో కారులో అటుగా వచ్చారు. గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తున్న విధంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వరద నీటిలోకి వెళ్లారు. కారు ముందు భాగం వరద నీటిలో మునిగిపోగా, వారిని స్థానికులు రక్షించారు. ఆ తర్వాత కారును బయటికి తీశారు

Related posts

రతన్‌ టాటాకు బెదిరింపులు.. ముంబయి పోలీసులు అలర్ట్‌.

TV4-24X7 News

ముగిసిన గడువు.. ఇవాళ జైలుకు వెళ్లనున్న డిల్లీ సీఎం

TV4-24X7 News

ఆశ్చర్యం.! విమాన ప్రమాదంపై 6 నెలల ముందే ట్వీట్.. నెట్టింట వైరల్..

TV4-24X7 News

Leave a Comment