తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన మొబైల్ ఫోన్లను ఆగస్టు 4 నుండి 5వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో ఐ ఫోన్లు, వివో, నోకియా, ఎల్‌వైఎఫ్, ఫిలిప్స్, సెల్కన్, మైక్రోమ్యాక్స్, రియల్ మీ, హువాయ్, టెక్నో, మోటోరోలా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న మొబైల్ ఫోన్లు 73 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.ఇతర వివరాలకు తిరుపతి లోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

next post