కడప / బద్వేలు:ఎండోమెంట్ దేవస్థానానికి భక్తుల నుండి వస్తున్న నగదు. బంగారు. వెండి తదితర ఆభరణాలు బ్యాంకు లాకర్ లో ఉండవలసింది. కానీ ఆ అభరణాలు ఈవో నరసయ్య ఇంట్లో ఉంటున్నాయి. కానీ గ్రామ పెద్దలు కానీ. సంబంధించిన అధికారులు గాని చూచి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే: పోరుమామిళ్ల మండలంలోని గుర్రప్పగారిపల్లె గ్రామ సమీపంలో శ్రీ మద్దిమాను గుర్రప్ప స్వామి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానానికి ప్రతి ఆదివారం భక్తులు భారీగా వస్తుంటారు. స్వామివారికి భక్తులు పూజలు నిర్వహించి భక్తులు తమ అనుకున్న కోరికలు తీరాయని నమ్మకంతో బోనాలు. కోళ్లు. మేకపోతులను బలి ఇస్తారు. ఈ దేవస్థానానికి సంబంధించిన ఈవో నరసయ్య. ఆధ్వర్యంలో మద్దిమాను గురప్ప స్వామి దేవస్థానంలో ఈనెల 25.వ తేదీన హుండీ లోని బంగారము, వెండి, నగదును లెక్కించడం చేశారు.ఈ లెక్కింపులో గుర్రప్పగారిపల్లె గ్రామానికి వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ మాల కొండయ్య. టిడిపి నాయకులు మల్లికార్జున రెడ్డి. తదితరులు కలసి హుండీ లెక్కింపు చేశారు ఈ లెక్కింపులో దాదాపు18 తులాల బంగారము.14 కేజీ ల వెండి. తో పాటు 6 లక్షల రూపాయలు నగదు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.నగదును మాత్రం బ్యాంకు ఖాతాలో జమ చేశారు. బంగారు. వెండి. లాకర్ లేదని సాకుతో లాకర్ ఓపెన్ చేసే వరకు దేవస్థానంలో భద్రపరచకుండా వాటిని ఈవో నరసయ్య ఇంటికి తీసుకువెళ్లారు. కానీ లెక్కింపు లో ఉన్న ఇరు వర్గాల పార్టీలు ఆ అభరణాల విషయంలో నోరు మెదపలేదు. దీంతో కొంతమంది భక్తులు. స్థానికులు వాటిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2011 వ సంవత్సరంలో ఈ దేవస్థానానికి సంబంధించి బంగారు.వెండి. నగలు చోరీ జరిగింది. అప్పట్లో ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ విచారణ చేపట్టి ఎట్టకేలకు నిగ్గు తేల్చి అప్పట్లో పని చేస్తున్న మేనేజర్ పై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గత ఐదు నెలల క్రితం ఈ దేవాలయానికి సంబంధించి హుండీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పలపడ్డారు. ఇలా దేవస్థానంలో చోరీకి పాల్పడడం.ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న ఈవో నరసయ్య ఈనెల 30 న పదవి కాలం పూర్తి కావడం. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఈవో నరసయ్య పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు సమాచారం. దీంతో లెక్కింపబడిన అభరణాలపై ప్రజల్లో. మరియు భక్తుల్లో పలు అనుమానాల వ్యక్తం చేయడమే కాక ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా కర్నూలు ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ చొరవ తీసుకొని ఈవో ఇంట్లో ఉన్న బంగారు. వెండిని స్వాధీనం చేసుకొని బ్యాంకు లాకర్ లో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు ప్రజలు కోరుతున్నారు.ఈవో వివరణ:బ్యాంకులో లాకర్స్ ఖాళీ లేవు.. అందుకే ఇంటికి తీసుకువెళ్లానుమద్దిమాను గురప్ప స్వామి దేవస్థానం ఈవో నరసయ్య…పోరుమామిళ్ల మండలంలోని మద్దిమాను గురప్ప స్వామి దేవస్థానానికి సంబంధించిన హుండీ లోని ఈనెల 25 వ తేదీన లెక్కింపు చేశామని అందులో ఉన్న నగదు ను బ్యాంకు ఖాతాలో జమ చేశామని. బంగారు. వెండి ని ఇంటికి తీసుకెళ్లాలని ఈవో నరసయ్య తెలిపారు. అదేవిధంగా బ్యాంకులో లాకర్ ఖాళీ లేవని బ్యాంకు అధికారులు చెప్పారని. అందువల్ల వాటికి భద్రత లేదని తన ఇంటికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

previous post