పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లె గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు విద్యనభ్యసించి మంచి స్థాయిలో ఉండగలిగిన సిద్దిపేట లయన్స్ క్లబ్ నెంబర్ దాసరిపల్లి జోజి (ex ఆర్మీ)(జ్యోతి మన వికాస కేంద్రం సిద్దిపేట) మరియు బద్వేల్ ఎంఈఓ ప్రమీల, కాకినాడ ఎంఈఓ దాసరపల్లి డేవిడ్,చాపాడు జడ్పీ హైస్కూల్ పీడీ ఓబయ్య వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు శారీరక మానసిక దృఢత్వానికి ఆటవిడుపు ముఖ్యంగా భావించి ఆట వస్తువు లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గురయ్య , బాల చెన్నయ్య లు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు జరగాలని ఇటువంటి కార్యక్రమాలకు పూర్వ విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు గ్రామాలలోని ఉద్యోగులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదేవిధంగా దాతలు జోజి, డేవిడ్, ప్రమీల, ఓబయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య బోధనలు ఉన్నాయని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను గ్రామాల పెద్ద మనుషులు చిన్న మనసులు పిల్లల తల్లిదండ్రులు అభివృద్ధి పరచుకోవాలని ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని ప్రభుత్వ సౌకర్యాలను అనుభవించాలని విద్యార్థులు తల్లిదండ్రులకు గుర్తు చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు నవోదయ క్లాసులో బోధించే విషయంలో తగిన మెటీరియల్ అందించగలమని వారు తెలియజేశారు.ఇలాంటి కార్యక్రమం మరెన్నో జరుపుకోవాలని ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్లాలని ఆశ భావం వ్యక్తం చేశారు. విద్యార్థినీ విద్యార్థులకు ఆట వస్తువులను బహుకరించిన జోజి, డేవిడ్, ప్రమీల, ఓబయ్య, లకు మరియు నూతనంగా వచ్చి పాఠశాల అభివృద్ధిలో అత్యధికంగా పాటుపడుతున్న ఉపాధ్యాయులకు గ్రామ పెద్దమనుషులు పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ ,వైస్ చైర్మన్ రామయ్యలు గ్రామ పెద్దలు బాలస్వామి, సాల్మన్, బాలకరయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
