*4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి
మిని అంగన్‌వాడీ కార్యకర్తల అప్‌గ్రేడేషన్. పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మిని అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. వీరి గౌరవ వేతనం నెలకు రూ.11,500 గా నిర్ణయించారు.
340 మిని అంగన్‌వాడీ కేంద్రాల విలీనం:
340 మిని అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలలో విలీనం చేయనున్నారు.
ఈ విలీనం రెండు షరతుల ఆధారంగా జరుగుతుంది:
▪️ఆ కేంద్రంలో లబ్ధిదారులు 10 కంటే తక్కువగా ఉండాలి.
▪️ఆ కేంద్రం సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రానికి 1 కిలోమీటరు లోపు అందుబాటులో ఉండాలి.ఈ ప్రక్రియ రాబోయే 4 సం.ల్లో దశల వారీగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.