కడప /బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి నిప్పు తెచ్చిన శ్రీ కనుమ పోలేరమ్మ ఆలయం వద్ద ప్రతి ఆదివారం, శుక్రవారం, మంగ్లవారం రోజున శ్రీ అమ్మవారి గుడి చుట్టూ శ్రీ కనుమ పోలేరమ్మ అమ్మవారిని ఊరేగింపుగా రథోత్సవం నిర్వహిస్తామని పిట్ పర్సన్ శంకర్ బాలాజీ తెలిపారు, శుక్రవారం పిట్ పర్సన్ శంకర్ బాలాజీ, మాజీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గొడ్లవీటి సుబ్రమణ్యం, తెదేపా నాయకుడు నరసింహులు దంపతులు భక్తులు రథోత్సవాన్ని నిర్వహించారు.శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ ,మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ఆదేశాలు మేరకు అమ్మవారి రధోత్సమును నిర్వహిస్తూన్నమని ఈ అవకాశాన్ని భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీ కనుమ పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందగలరని వారన్నారు. ఈ కార్యక్రమం లో ప్రసాద్ పూజారి,మిథున్ పూజారి,సిబ్బంది చిన్న సుబ్బారాయుడు,భక్తులు తది తరులు పాల్గొన్ని రధోత్సవంను జయపదం చేశారు.
