Tv424x7
Andhrapradesh

వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారికి పోలీసు వారి ముఖ్య సూచనలు

మధిర టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో :

  1. మధిర టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించదలచిన వారు ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
  2. ఆ కమిటీ వారిదే పూర్తి బాధ్యత అని గుర్తించాలి.
    ((కమిటీ సభ్యులు వివరాలు, ఫోన్ నంబర్లు పోలీస్ స్టేషన్ నందు తప్పనిసరిగా ఇవ్వాలి)))
  3. పబ్లిక్ ప్రదేశాలలో విగ్రహాలు ఏర్పాటు చేయువారు సంబంధిత పంచాయితీ వారి అనుమతి తీసుకోవాలి.
  4. సొంత స్థలాలలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్లు అట్టి స్థలానికి సంబంధించిన యజమాని అనుమతి తప్పనిసరిగా పొందవలెను.
  5. విగ్రహాలు ఏర్పాటు చేయు ప్రదేశాలలో ప్రజలకు గాని ట్రాఫిక్ గాని ఎటువంటి ఆటంకాలు కలగజేయరాదు.
  6. పోలీస్ స్టేషన్ ద్వారా డీఎస్పీ గారు వద్ద అనుమతి తీసుకుని మాత్రమే మైకులు సౌండ్ బాక్స్ లు వంటివి పెట్టుకోవాలి. ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా సౌండ్ పెట్టాలి.

****డీజే లు వంటి వాటికి

అనుమతి ఉండదు.*

గమనించాలి.

  1. రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు.
  2. మండపంలో హుండీలు విలువైన వస్తువులు పెట్టుకున్న ఎడల వాటి పూర్తి బాధ్యత కమిటీ వారే తీసుకోవాలి. విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ అధికారులు నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలి ఎటువంటి షార్ట్ సర్క్యూటలకు తావు ఇవ్వకుండా లైటింగ్ వంటివి పెట్టుకోవాలి.
  3. ఇతర మతాల వారికి గాని ప్రార్ధన మందిరాలకు గాని ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
  4. విభేదాలకు చోటు ఇవ్వకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.
  5. సాంస్కృతిక కార్యక్రమాలు పేరిట అశ్లీల నృత్యాలు రికార్డింగ్ డాన్సులు, కొజ్జా మేళములు వంటివి జరిపినట్లయితే తగిన చట్టమైన చర్యలు తీసుకొనబడును.
  6. బలవంతంగా ఎవరినైనా చందాలు వసూలు చేస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్న బడును.
  7. మండపానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు బారికేళ్ళు వంటివి ముందుగానే పెట్టుకోవాలి.
  8. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  9. ఊరేగింపు సమయంలో నిమజ్జనం చేయడానికి వెళ్ళు సమయంలో మద్యం వంటివి సేవించకుండా శాంతిభద్రతలు కి భంగం కలిగించడం వంటివి చేయరాదు. అటువంటివారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకొనబడును.
  10. ఊరేగింపు తేదీ మరియు ఊరేగింపులో పెట్టదలిచిన కార్యక్రమాలు వివరాలు ముందుగానే పోలీస్ వారికి తెలియజేసి ఊరేగింపులో ఉపయోగించే వాహనాలు డ్రైవర్ల రికార్డులు ఆధార్ కాపీలు పోలీసు వారికి ఇవ్వవలెను.
    ఇట్లు
    D. Ramedh.
    Inspector of police
    Madhira town ps.

Related posts

మాదకద్రవ్యాల బారిన పడొద్దు

TV4-24X7 News

ఏపీలో వచ్చే ఏడాది నుంచి కొత్త డిగ్రీ కోర్సులు

TV4-24X7 News

ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్స్ చైర్మన్ గా నియమితులైన గండి బాబ్జి కి అభినందనలు తెలిపిన 39 వ వార్డు టీడీపీ నాయకులు

TV4-24X7 News

Leave a Comment