దేశంలోఆన్లైన్ బెట్టింగ్ ఎన్నో జీవితాలను నాశనం చేసింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈజీ మనీ కోసం చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసలుగా మారి సర్వం కోల్పోతున్నా రు. అప్పుల పాలై తనువు చాలించిన వారూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ ఆన్లైన్ బెట్టింగ్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
నిజానికి ఆన్లైన్ గేమింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇబ్బ డిముబ్బడిగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. ఆదాయం కంటే సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025ను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.
డబ్బుతో ముడిపడ్డ ఎలాంటి ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియనైనా ఈ బిల్లు పూర్తిగా నిషేధిస్తుంది. అదే సమయంలో గేమింగ్ పరిశ్రమ దెబ్బతినకుండా ఉండేందుకు ‘రియల్ మనీ’తో సంబంధం లేకుండా నిర్వహించే ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్‌ను ప్రోత్సహించడానికి సైతం ఈ బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచింది. డబ్బులు పెట్టి ఆడే గేమ్‌లపై ప్రస్తుతం దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
యువతలో వ్యసనం, ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలను ప్రధాన ఆందోళనలుగా పేర్కొంటూ నగదు లావాదేవీలతో నడిచే ఆన్లైన్ గేమ్‌లపై కేంద్రం నిషేధం విధించింది. అంటే డబ్బులు పెట్టి ఆడే అన్ని ఆటలను నిషేధిస్తూ నిర్ణ యం తీసుకుంది. ఫాంటసీ క్రీడలు, పోకర్, రమ్మీ వంటి కార్డ్ గేమ్‌లు, ఆన్లైన్ లాటరీలతో సహా అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, జూదంపై నిషేధం విధిం చింది. గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నిషేధం విధించారు.
ఆన్లైన్ గేమ్‌లు ఆడేవారి ని మాత్రం శిక్షల నుంచి మినహాయించారు. వీరిని బాధితులుగా పరిగణించా లని బిల్లులో పొందుపరి చారు. దీని కోసం గత మూడున్నర ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. యాడ్స్, ప్రమోషన్స్ చేసినా నేరమే ఆన్లైన్ గేమింగ్ బిల్లు- 2025 నిబంధనలను ఉల్లంఘించి డబ్బు ఆధారిత గేమింగ్ సేవలను అందించే సంస్థలు, బాధ్యు లకు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా ఒక రూ.కోటి వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ఆయా గేమ్‌లను ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు రెండేళ్ల దాకా జైలు, రూ.50 లక్షల జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. అంటే గేమింగ్ యాప్‌ల ప్రకటనల్లో పాల్గొనే సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు సైతం కొత్త చట్టం ప్రకారం శిక్షార్హులే అని బిల్లు స్పష్టం చేస్తోంది.
చాలా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ ఉత్పత్తులను ‘నైపుణ్య ఆధారిత ఆటలు’గా ముసుగు వేసుకుని, బెట్టింగ్ నుంచి వేరుగా కనిపించేందుకు ప్రయత్నిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ కొత్త బిల్లు ప్రకారం ఇవన్నీ కచ్చితంగా బెట్టింగ్గానే పరిగణిస్తూ చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించాయి.