Tv424x7
PoliticalTelangana

మంగళగిరి రేసులో నేనున్నా.. కొత్త వాళ్లకి సీటు కావాలంటే కుదరదు: కాండ్రు కమల

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే పదవికి, వైకాపా సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) రాజీనామా చేయడంపై మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల (Kandru Kamala) స్పందించారు..రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత అంశం అన్నారు. ఆర్కే రాజీనామా పార్టీకి తీవ్ర నష్టమన్నారు..”సీఎంకు ఆర్కే సన్నిహితుడు కాబట్టి.. ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది. ఆర్కే గెలిచాక ఒక నెల మాత్రమే మాతో సఖ్యతగా ఉన్నారు. ఆ తర్వాత కార్యక్రమాలకు మమ్మల్ని దూరం పెట్టారు. పార్టీ పరువు తీయకూడదనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాను. ఆర్కే గెలుపు విషయంలో నా కృషి చాలా ఉంది. నా వల్లే ఆయనకు మెజార్టీ వచ్చింది. నేను కూడా మంగళగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నా. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు సీటు కావాలంటే కుదరదు. అధిష్ఠానం నిర్ణయం మేరకు నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా” అని కాండ్రు కమల తెలిపారు..

Related posts

విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉంది.. సీఎండీపై చర్యలు తీసుకోవచ్చా?: రేవంత్ రెడ్డి

TV4-24X7 News

3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా! లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ

TV4-24X7 News

చిట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ)129 వ జయంతి సందర్భంగా వీరనారి ఐలమ్మకు విప్లవ జోహార్లు..

TV4-24X7 News

Leave a Comment