Tv424x7
Telangana

మహిళలకు డబుల్ బొనంజా.. పండక్కి ఒకటి కాదు రెండు చీరలు!

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. రాబోతున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి మహిళలకు కానుక ఇవ్వడానికి రెడీ అవుతోంది.ప్రభుత్వం తరఫున ఈసారి మహిళలకు రెండు ఇందిరమ్మ చీరలను కానుకగా ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

బతుకమ్మకు మహిళలకు చీరల పంపిణీ గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల పేరుతో ప్రతి బతుకమ్మ పండుగకు చీరలను మహిళలకు కానుకగా ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పేరుతో దసరా సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చీరల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి మహిళా పొదుపు సంఘాలను భాగస్వామ్యం చేసింది. రేవంత్ ప్రభుత్వం పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి మహిళకు ఉచితంగా రెండు చీరలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది.

సిరిసిల్ల నేతన్నలతో 65 లక్షల చీరల తయారీ ఇప్పటికే సిరిసిల్ల నేతన్నలకు ఈ మేరకు ఆర్డర్లు జారీ చేసిన సర్కార్ మొత్తం 65 లక్షల చీరల తయారీని చేయిస్తోంది. సిరిసిల్లలోని నే ఏడాది పొడుగునా ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ హామీ అమలులో భాగంగా ప్రస్తుతం వీరికి ఇందిర మహిళా శక్తి పథకం కింద చీరల తయారీకి ఆర్డర్ ఇచ్చింది. ఈ పథకం కోసం 318కోట్ల రూపాయలను కేటాయించి ఇందిరమ్మ చీరలను ఉత్పత్తి చేస్తుంది.

ఇందిర మహిళా శక్తి పథకంతో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి తెలంగాణ సర్కార్ అందించే ఈ పథకం వల్ల సుమారు 6 వేల మంది కార్మికులు నెలకి 20వేల చొప్పున సంపాదిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే బతుకమ్మ పండుగ నేపథ్యంలో సిరిసిల్ల నేతన్నలు దాదాపు 30 లక్షల చీరలను ఉత్పత్తి చేశారు. చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ఈ చీరలు ఉత్పత్తిని పర్యవేక్షిస్తున్నారు.

ఒకటి కాదు రెండు చీరలను సిద్ధం చేస్తున్న తెలంగాణా సర్కార్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు అందించిన చీరలు నాసిరకం చీరలు గా ఉన్నాయని ఆరోపణలు వచ్చిన క్రమంలో, ప్రభుత్వ హయాంలో అటువంటి పరిస్థితి లేకుండా నాణ్యమైన బట్టతో చీరలను నేయిస్తున్నారు. ఈసారి బతుకమ్మ పండుగకు మహిళా సంఘాల మహిళలకు ఇచ్చే ఈ చీరల ధర ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు గా ఉంటుందని చెబుతున్నారు. గత ప్రభుత్వం ఒక చీర ఇస్తే ఈ ప్రభుత్వం రెండు చీరలను ఇచ్చి బతుకమ్మ పండుగ కానుక ఇస్తుందని చెబుతున్నారు.

Related posts

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ..

TV4-24X7 News

కొనసాగుతున్న సింగరేణి అధికారుల అమెరికా పర్యటన

TV4-24X7 News

తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..!!

TV4-24X7 News

Leave a Comment