కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించే వారిపై పోలీస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హెచ్చరించారు. ఫేక్ వీడియోలు ద్వారా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి వారిని అయోమయానికి గురి చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టేలా ఫేక్ ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం చట్ట ప్రకారం పోలీస్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం నార్సింపల్లి గ్రామానికి చెందిన వైసిపి మద్దతుదారుడు పలవాయి గారి రమేష్ సన్నాఫ్ రామప్ప అనే యువకుడు ఇలాంటి పెన్షన్కు అర్హుడు కానప్పటికీ తనకు వికలాంగుని పెన్షన్ రద్దు అయినట్టు ఫేక్ వీడియోస్ సృష్టించి వైసిపి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన రమేష్ అనే వ్యక్తి దుష్ప్రచారం చేశారు. ఇతనికి రెండు చేతులు రెండు కాళ్లు సక్రమంగా పనిచేస్తున్నాయని అయినప్పటికీ చేతులు లేనట్టు నటించి దివ్యాంగుడైన నా పెన్షన్ ను కూటమి ప్రభుత్వం రద్దుచేసిందని ఫేక్ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేయడం పై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఇతనిపై బుక్కపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నర్సింపల్లి కి చెందిన వైసీపీ మధుదారుడైన రమేష్ గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేసి సోషల్ మీడియా ద్వారా ఫేక్ వీడియోలు వైరల్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 64 లక్షల కుటుంబాలకు ప్రతి నెల ఒకటో తారీఖున తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం లోపు సుమారున్న రూ.34వేల కోట్లు అర్హులైన పేదలకు పెన్షన్ మంజూరు చేస్తూ దేశంలోని అత్యధిక పెన్షన్ మంజూరు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,మంత్రి నారా లోకేష్ బాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిగిన కూటమి నాయకులపైన ఉద్దేశపూర్వకంగా ఫేక్ వీడియోలు ద్వారా దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హెచ్చరించారు.
