కడప /ప్రొద్దుటూరు పట్టణంలో 12, 13 తేదీల్లో నీటి సరఫరా బంద్ చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య సోమవారం తెలిపారు. మైలవరం నుంచి నూతనంగా నిర్మించిన పైపులైన్ జమ్మలమడుగు రోడ్డు ధర్మాపురం వద్ద లీకేజ్ కావడంతో సరఫరాను నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, దొరసానిపల్లె రోడ్డు, పవర్ హౌస్ రోడ్డు, వినాయక నగర్, హనుమాన్ నగర్, రామేశ్వరం తదితర ప్రాంతాలకు నీటి సరఫరాను బంద్ చేశామన్నారు.

previous post