Tv424x7
National

ఆంజనేయుడి గుడి కడదామని పునాదులు తవ్వుతున్నారు.. ఇంతలో అద్భుతం

ఊరంతా జమ కూడారు. మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టుకుందామని.. మంచిదని భావించారు. ఇందుకోసం విరాళాలు కూడా సేకరించారు. గ్రామ సర్పంచ్ తన పూర్వికుల భూమిని ఆలయ నిర్మాణం కోసం దానమిచ్చారు. అయితే ఇందుకోసం పునాదులు తవ్వుతుండగా ఏం బయటపడ్డాయో తెలుసా..?

మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో గురువారం ఒక అరుదైన ఘటన వెలుగుచూసింది. ఊర్లో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టలని గ్రామస్థులు సంకల్పించారు. ఇందుకోసం అందరూ చందాలు వేసుకున్నారు. టెంపుల్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనుల కోసం పునాదులు తవ్వుతుండగా.. ఆశ్చర్యకరంగా… ప్రాచీన కాలానికి చెందిన బంగారు నాణేలు బయటపడ్డాయి. సగౌరియా పురా గ్రామంలో జరుగుతున్న తవ్వకాల సమయంలో నాణేలు లభించడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకింది. గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకుని ఆ నాణేలను ఆసక్తిగా పరిశీలించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సుమారు 50 నుండి 60 బంగారు నాణేలు బయటపడ్డాయని గ్రామ సర్పంచ్ సంతోషీలాల్ ఢాకడ్ తెలిపారు. అయితే పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ రాజేంద్ర పరిహార్ మాత్రం ఇప్పటివరకు కేవలం 20–25 నాణేలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం ఎంతమంది నాణేలు లభించాయి..? ఆ ప్రాంతంలో ఇంకా నాణేలు పాతిపెట్టి ఉన్నాయా..? అనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇక ఈ నాణేల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి నిపుణులను కూడా పిలిపిస్తున్నారు. అవి నిజంగానే ప్రాచీన కాలానికి చెందినవే అయితే, ఏ శకానికి సంబంధించినవో తెలుసుకోవడానికి పరిశోధన చేపట్టనున్నారు. ఈ నాణేలు బయటపడిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికారుల నివేదిక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts

బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీ

TV4-24X7 News

అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా

TV4-24X7 News

2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు:ప్రహ్లాద్ జోషి

TV4-24X7 News

Leave a Comment