Tv424x7
Andhrapradesh

మైనర్ బాలిక ఫై అత్యాచార కేసులో ఇద్దరు ముద్దాయిలు లకు యావజ్జీవ జైలు శిక్ష విధించిన పోక్స్ కోర్టు

బాధితురాలికి 3 లక్షల రూపాయలు నష్ట పరిహారం

ముద్దాయిల కు యావజ్జీవ జైలు శిక్ష వారు జీవించినంత కాలం

పోలీస్ వారిని అభినందించిన జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్

తిరుపతి

👉 పోక్సో కేసులో నిందితులు చిత్తూరు.జిల్లా కు చెందిన బుక్కే వెంకటేష్ (34) (A 1) ,రాజమోహన్ నాయక్ (34)(A 2) లపై నేరం ఋజువు కావడంతో పోక్సో కోర్టు గౌరవ జడ్జి ఎం.శంకర రావు ఒకొకరికి జీవిత కాలం యావజ్జీవ జైలు శిక్ష అందులో భాగంగా A 1 కు రూ . 17 ,500/- A2 కు రూ .13,500 /- జరిమానా విధించారు .బాధితురాలికి 3 లక్షల రూపాయలు నష్ట పరిహారం మంజూరు చేసారు.

👉 మదనపల్లి కి చెందిన 16 సంవత్సరములు వయస్సు కలిగిన మైనర్ బాలిక నవంబర్ 24 వ తరికన 2019 లో తిరుమల కు వెళ్లి దేవుడి ని దర్శనం చేసుకొని వచ్చి రాత్రి తిరుచానూరు కు వెళ్ళడానికి నడచి వెళుతుండగా తిరుచానూరు మండలం బ్రాహ్మణ పట్టు కి చెందిన చిత్తూరు.వెంకటేష్ తన మోటార్ సైకిల్ లో రాగా అతని లిఫ్టు అడగగా అతను మైనర్ బాలికను తన మోటార్ సైకిల్ లో ఎక్కించుకొని తిరుచానూరు వద్ద దింపకుండా తిరుచానూరు దాటుకొని ముళ్ళపూడి గ్రామం సమీపంలో వెళుతూ మోటార్ సైకిల్ లో పెట్రోలు అయిపోయింది అని నిలిపివేసినాడు . వారు ఇరువురు కలిసి మైనర్ బాలికను అత్యాచారం చేసినారు.బాధితురాలు నింతుల చెరనుంచి తపించుకుని తప్పించుకొని అరుచుకుంటూ రోడ్డు వైపు కు రాగా కొంత మంది అటువైపు వస్తూ యుండగా వారు తనను నిలిపి ఏమి జరిగింది అని విచారించడం చూసి నిందితులు పారిపోయినారు .

👉 మైనర్ బాలిక తన తల్లిసహాయం తో తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినారు.తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేసారు .

👉 చిత్తూరు గౌరవ పోక్సో కోర్టు లో కేసు ను విచారించిన తరువాత ఇద్దరు ముద్దాయిలు పై నేరం రుజువు కావడంతో గౌరవ జడ్జి ఇద్దరు ముద్దాయిల కు యావజ్జీవ జైలు శిక్ష వారు జీవించినంత కాలం వరకు జైలు శిక్ష అనుభవించేలా శిక్ష విధించి తీర్పు ఇచ్చారు.

👉 గౌరవ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి వి. మోహనకుమారి ప్రాసిక్యూషన్ తరపున కేసు వాదించారు.కోర్టు లైసన్ ఆఫీసర్ గిరీష్ సాక్షులను కోర్టు లో హాజరు పరిచారు .

👉 ఈ కేసులో విశేష ప్రతిభ కనబరచిన స్పెషల్ పీ.పీ. గారిని , లైసెన్ ఆఫీసర్ ని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్.,వారు అభినందించారు.

Related posts

హెచ్.అర్.సి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎనికైనా బడ్డుకొండ రాజేష్

TV4-24X7 News

గోరంట్ల మాధవ్‌కు మే 7 వరకు రిమాండ్‌

TV4-24X7 News

వాహనాల తనిఖీలు నిర్వహించిన విశాఖ నగర పోలీసులు

TV4-24X7 News

Leave a Comment