Tv424x7
Andhrapradesh

అర్చకుల పేరుతో ఘరానా మోసం


కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకస్వామి, తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయ పూజారుల పేరుతో వచ్చి ప్రజల భక్తిని సొమ్ము చేసుకునే ముఠా సులువుగా లక్షలు దోచుకుంటోంది.ఆలయాల పవిత్రత, భక్తుల నమ్మకాలను దెబ్బతీసేలా ఓ ముఠా దందా సాగిస్తోంది.

మీ ఇంట్లోకి రావచ్చా…

అకస్మాత్తుగా ఇంటి ముందుకు ఓ ఐదుగురు పురోహితులు వచ్చి ‘మీ ఇంట్లోకి రావచ్చా’ అని అడుగుతారు. స్వాములు వచ్చారని లోనికి రమ్మనగానే అందరూ ఒక్కసారిగా ఏవో మంత్రాలు చెబుతూ ఇంట్లోకి వస్తారు. మంత్రాలను కొనసాగిస్తూ పూజ తట్ట తీసుకురమ్మని అందులోకి విభూది, కుంకుమ, నాలుగు పూలు వేసి ఇంట్లో వాళ్ల చేతిలో పెడతారు. తమలో ముగ్గురు కాణిపాకం ఆలయ అర్చకులమని, మరో ఇద్దరు తిరుత్తణి ఆలయ అర్చకులమని పరిచయం చేసుకుంటారు. భగవంతుడి నిర్దేశం మేరకు ఆ ఇంటికి వచ్చామని, ఇకపై అన్నీ శుభాలే కలుగుతాయని చెబుతారు. వినాయకచవితి సందర్భంగా కాణిపాకంలో పెద్ద ఎత్తున అన్నదానం చేసేందుకు మీ కుటుంబం తరపున రూ 5,116కు తక్కువ కాకుండా నగదు రూపంలో విరాళం ఇవ్వాలని కోరతారు. తమకు సమయం లేదని వెంటనే నగదు ఇస్తే త్వరగా వెళ్లాలని

Related posts

విశాఖ జైలు నుంచి కోడికత్తి శ్రీనివాస్ విడుదల…

TV4-24X7 News

వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

TV4-24X7 News

ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా.

TV4-24X7 News

Leave a Comment